calender_icon.png 16 August, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

16-08-2025 08:04:10 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): 108 అంబులెన్స్ లో గర్భిణీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన శనివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపాడు మండలం రామాపురం కెసిఆర్ కాలనీకి చెందిన సిహెచ్. స్వప్నకి పురిటి నొప్పులు రావడంతో మొరంపల్లి బంజర పిహెచ్సికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించిన తరుణంలో నొప్పులు తీవ్రమయ్యాయి.

వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిగా అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో పైలట్ విజయ్ భాస్కర్ వాహనాన్ని మార్గం మధ్యలో నిలిపి ఈఎంటీ సుభద్ర చాకచక్యంగా వ్యవహరించి మూడో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన వెంటనే తల్లి బిడ్డలను క్షేమంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లి,బిడ్డను పరీక్షించి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలెట్ విజయ్ భాస్కర్,ఈఎంటి సుభద్రను వైద్యులు అభినందించారు.