calender_icon.png 16 August, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే

16-08-2025 08:29:45 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన వాగులు వంకలు పోర్లడంతో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 5, 20వ వార్డులలో ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) సందర్శించి వరద ఉధృతికి గురైన ప్రాంతాలలో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా ఆదేశించారు. అనంతరం 20వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ ఎంపీపీ మండల రాము, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దొడ్డ డానియల్, జాఫర్, నాయకులు సాంబమూర్తి బోల్ల సూర్యం, జిల్లా శ్రీను, గందే సదానందం, వెంకన్న, రమేష్, ఈసం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.