24-07-2025 12:46:25 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కేటీఆర్ 49వ జన్మదిన(KTR birthday celebrations) వేడుకలను పట్టణ అధ్యక్షుడు కొలిపక శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారంఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలుజరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, రమాదేవి రోశెందర్, గని శెట్టి ఉమామహేశ్వర్,నరేష్, కృష్ణ, ఇమ్రాన్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.