calender_icon.png 26 July, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలి

25-07-2025 11:38:06 PM

గజ్వేల్ ఏసిపి నర్సింలు

దౌల్తాబాద్,(విజయక్రాంతి): గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని గజ్వేల్ ఏసిపి నర్సింలు అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రోజువారి విధులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. విపిఓ వ్యవస్థను మెరుగుపరచాలని వారంలో రెండు మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా పరిశోధన కొనసాగాలని కేడీలు, డీసీలు, సస్పెక్ట్ లు రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు సిబ్బంది వీధి నిర్వహణలో అలసత్వం వహించరాదని అన్నారు. ఇసుక, పిడిఎస్ రైస్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రతిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శించినప్పుడు గంజాయి ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.