calender_icon.png 27 September, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారు

27-09-2025 05:36:53 PM

కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థలకు సంబంధించి కరీంనగర్ జిల్లా జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు ఉండగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు, 50 శాతం మహిళా రిజర్వేషన్ల దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని కొత్తపల్లి జడ్పీటీసీ జనరల్ మహిళ కాగా ఎంపీపీ జనరల్ కేటాయించారు. గంగాధర జడ్పీటీసీ జనరల్ కాగా, ఎంపీపీ జనరల్ మహిళ, మానకొండూర్ జడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ కూడా జనరల్ మహిళకు రిజర్వు కాబడింది. రామడుగు జడ్పీటీసీ ఎస్సీ జనరల్ కాగా, ఎంపీపీ బీసీ మహిళ, చిగురుమామిడి జడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ బీసీ జనరల్ కు కేటాయించారు.

కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ జనరల్, చొప్పదండి జడ్పీటీసీ బీసీ జనరల్, ఎంపీపీ బీసీ మహిళ, శంకరపట్నం జడ్పీటీసీ బీసీ మహిళ, ఎంపీపీ బీసీ మహిళ, ఇల్లందకుంట జడ్పీటీసీ బీసీ జనరల్, ఎంపీపీ ఎస్సీ జనరల్, తిమ్మాపూర్ జడ్పీటీసీ బీసీ మహిళ, ఎంపీపీ ఎస్సీ జనరల్, సైదాపూర్ జడ్పీటీసీ ఎస్సీ మహిళ, ఎంపీపీ ఎస్సీ మహిళ, జమ్మికుంట జడ్పీటీసీ బీసీ మహిళ, ఎంపీపీ బీసీ జనరల్, వీణవంక జడ్పీటీసీ బీసీ జనరల్, ఎంపీపీ జనరల్, హుజూరాబాద్ జడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ జనరల్, గన్నేరువరం జడ్పీటీసీ జనరల్, ఎంపీపీ జనరల్ మహిళకు కేటాయించారు.