calender_icon.png 16 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ హత్యలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై ఫైర్

16-07-2025 11:32:01 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలపై స్పందిస్తూ భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Chief Minister Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో దుండగుల కాల్పుల్లో మరణించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Communist Party of India) నాయకుడు చందు నాయక్ హత్య, మెదక్ జిల్లాకు చెందిన ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నాయకుడు అనిల్ అనుమానాస్పద మరణాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రతీకార చర్యల కోసం రాష్ట్ర పరిపాలనను దుర్వినియోగం చేస్తున్నారని కేేటీఆర్ ఆరోపించారు.

“రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే పనిచేసినప్పుడు ఏమి జరుగుతుందో మనం చూస్తున్నాము. రాష్ట్రంలో పూర్తి సమయం హోం మంత్రి లేకపోవడం వల్ల కలిగే పరిణామాలను మనం చూస్తున్నాము” అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన సోదరులు మొత్తం రాష్ట్ర పరిపాలనను తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శించారు. ఎటువంటి అనుభవం, అవగాహన లేని వ్యక్తులు ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చున్నప్పుడు ఏమి జరుగుతుందో మనం చూస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిని మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుతూ “బీఆర్ఎస్ హయాంలో, తెలంగాణ శాంతిభద్రతల పర్యవేక్షణలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది” అని అన్నారు. 24 గంటల్లోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, పెరుగుతున్న అభద్రతా భావం రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రతికూల ప్రభావానికి స్పష్టమైన సూచన అని  కేటీఆర్ తెలిపారు.