16-07-2025 12:10:57 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ(CPI Narayana) పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం శుభసూచకం అన్నారు. నీటి వాటాలు తేల్చిన తర్వాతే ప్రాజెక్టుల గురించి చర్చించాలని నారాయణ పేర్కొన్నారు. జల వివాదాలు పరిష్కరించాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరారు. జల్ శక్తి శాఖ మంత్రి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై ఢిల్లీలో నేడు కీలక సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై(Godavari-Banakacharla Project) చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా, బనకచర్లపై చర్చ అనవసరం లేదని మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.