calender_icon.png 25 August, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్..అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు లేదా?

25-08-2025 12:57:20 AM

  1. ఉప ఎన్నికలు వచ్చినా గెలిపించుకుంటాం 
  2. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి ):  పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడ టం చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉన్నాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శిం చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అత్యంత నిర్లజ్జంగా పార్టీ ఫిరాయింపు లు చేసిన కేటీఆర్.. ఇప్పుడు దొంగ ఏడుపు లు ఏడుస్తున్నాడని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనా మా లు చేయాలని అడిగే హక్కు కేటీఆర్‌కు లేదని హితవు పలికారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పు డు ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు.

అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఉప ఎన్నికలు వచ్చినా వారిని గెలిపించుకునే సత్తా, దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు.