calender_icon.png 23 January, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరంలో నీటి వికేంద్రీకృతే లక్ష్యం

23-01-2026 01:05:53 AM

నీటి భద్రత, వరద ముప్పు నివారణే తొలిరక్షణ కవచం

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకర ణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. కేవలం మౌలిక వసతుల విస్తరణ పైనే ఆధారపడకుండా వికేంద్రీకృత నీటి నిర్వహణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. నగరంలో నీటి భద్రత, వరద ముప్పు నివారణే మనకున్న తొలి రక్షణ కవచమని పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సీఐఐ, సోహ్రాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్లో మురుగునీరు, వర్షపు నీటి నిర్వహణపై స్టేక్ హోల్డర్లతో ప్రత్యేక మేధోమధన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా జీహెచ్‌ఎంసీ వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ బలోపేతం, నాలాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టింది.

అయితే, అంచనా వేయలేని విధంగా కురుస్తున్న వర్షాలు, నగర విస్తరణ వేగాన్ని తట్టుకోవడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ ఒక్కటే సరిపోదు. అందుకే వాతావరణ మార్పుల నుం చి నగరాన్ని కాపాడుకోవడానికి వికేంద్రీకృత పద్ధతిలో నీటిని నిల్వ చేయడం, పున ర్వినియోగించడం అత్యంత ఆవశ్యకమన్నా రు. ఇందులో పరిశ్రమల సంఘాలు, డెవలపర్లు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ,ఫెసిలిటీ మేనేజర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.