17-12-2025 01:26:53 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమ ర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65 శాతం సీట్లు వచ్చాయని, రెండు విడతల్లో కలిపి 5,500లకు పైగా గెలిచామన్నారు. సిరిసిల్లలో ఒక మండలంలో ఎన్నికలు జరిగితే కేటీఆర్ విజయోత్సవ సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన విషయా న్ని కేటీఆర్ మర్చిపోవద్దని హితవుపలికారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు అని చెప్పి ఓటమి చెందారు.. గత పార్లమెంట్ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అని చెప్పి బీఆర్‌ఎస్ పూర్తిగా దెబ్బతిన్నదని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థిని కేటీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. పదేళ్లు అధికారమిస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమ య్యా రని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం నిత్యం ప్రజల్లో ఉండటమే కాకుం డా 18 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భూ కబ్జాలపై కవిత చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.