calender_icon.png 18 December, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో ‘జీరోడే సీటీఎఫ్’ ప్రారంభం

17-12-2025 01:28:24 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం, సమాచార సాంకేతిక (ఐటి) సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘జీరో డే సిటిఎఫ్ (క్యాప్చర్ ద ఫ్లాగ్) హ్యాకథాన్’ ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ వై.వి. రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్ పి.వి. కుమార్ అలాగే ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు జి. సాయి కృష్ణ, ఐ. మహేష్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ సందీప్ కుమార్ శుక్లా డైరెక్టర్, సి3ఐ సెంటర్, ఐఐఐటి హైదరాబాద్, డాక్టర్ శ్రీరామ్ బిరుదావోలు, సీఈఓ, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ హాజరయ్యారు.

ఈసందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఎథికల్ హ్యాకింగ్ అవగాహన, వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి పోటీల ద్వారా తమ సాంకేతిక ప్రతిభను పెంపొందించుకుని, భవిష్య త్తులో ఉద్భవించే సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారని పేర్కొన్నారు.

అనురాగ్ విశ్వవిద్యాలయం ఐటిసైబర్ సెక్యూరిటీ విభాగం నిర్వహిస్తున్న ‘జీరో డే సిటిఎఫ్ ద్వారా 350 మంది విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్, టీమ్వర్క్ సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు వేదిక కల్పిస్తున్నదని నిర్వాహకులు పేర్కొన్నారు.

జీరో డే సిటిఎఫ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు అనురాగ్ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని విద్యార్థి కో-ఆర్డినేటర్లు సాత్విక్, సాయికృష్ణ, అలాగే ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు జి. సాయి కృష్ణ, ఐ. మహేష్ కుమార్, స్వామి తెలిపారు.