calender_icon.png 17 December, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ జోరుతో కారు పార్టీ కంగారు

17-12-2025 01:25:09 AM

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ  బల్మూరు వెంకట్ 

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుతో కారు పార్టీ కంగారు పడుతోందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విమర్శించారు. పల్లె ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో రెండు విడతల్లోనూ ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజక వర్గంలోని ఒక మండలంలో నాలుగైదు సర్పంచ్‌లను బీఆర్‌ఎస్ గెలవగానే కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్.. తన నియోజకవర్గంలో ఐదారుగురు గెలిస్తే  ఒకటే హడావిడి చేస్తున్నారన్నారు. తమ పార్టీలో నాయకుల మధ్య పోటీ పెరగడం వల్లే కొన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు అవకాశం వచ్చిందన్నారు.