25-07-2025 12:00:00 AM
ఇంద్రేశంలో కార్యకర్త ఇంటికి వచ్చి కేక్ కట్ చేసిన కేటీఆర్
పటాన్ చెరు, జులై 24 : బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేసిన పోస్టును బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ రీపోస్టు చేయడంతో అరెస్టయి విడుదల అయ్యారు. కాగా విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పటాన్ చెరు మండలం ఇంద్రేశం సమీపంలోని కాలనీలో నివాసం ఉండే శశిధర్ గౌడ్ ఇంటికి గురువారం వచ్చారు.
శశిధర్ గౌడ్ ను ఆయన కుటుంబీకులను కలిసి సంఘీబావం తెలిపారు. శశిధర్ గౌడ్ అరెస్టు నేపథ్యంలో కూతురు జన్మదిన వేడుకలు కూడా కుటుంబీకులు చేయలేదు. దీంతో కేటీఆర్ ప్రత్యేకంగా కేక్ తీసుకొచ్చి కుటుంబీకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం శశిధర్ గౌడ్ ఇద్దరు పాపలకు ప్రత్యేకమైన బహుమతులు కూడా కేటీఆర్ అందజేశారు. కేటీఆర్ ఇంటికి రావడంతో ఇద్దరు పాపలు ప్రత్యేకంగా తయారు చేసిన గిఫ్ట్ లను అందజేశారు.
అనంతరం అక్కడే కుటుంబీకులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, కుటుంబీకులకు ఎప్పడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం శశిధర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ చేసిన పోస్టును రీపోస్ట్ చేయడంతో పోలీసులు తనను అరెస్టు చేశారని మీడియాతో చెప్పారు. ఈ విషయంలో కేటీఆర్ వచ్చి తనను, తన కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారని చెప్పారు.
తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ బిజీగా ఉన్నా తన కోసం ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా శశిధర్ గౌడ్ ఇంటికి కేటీఆర్ వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం...సీఎం అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీపడ్డారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు గడీల శ్రీకాంత్ గౌడ్, కొలను బాల్ రెడ్డి, సీజీఆర్ ట్రస్టు చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గోవర్దన్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిన్నారం మండలం మాదారంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యర్తలు కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. గిఫ్ట్ ఏ స్త్మ్రల్ కార్యక్రమంలో భాగంగా మాదారం గ్రామంలో నిర్మిస్తున్న పంచముఖి హనుమాన్ విగ్రహానికి బీఆర్‌ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రూ.1,11,000 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశంగౌడ్, మండల అధ్యక్షుడు రాజేశ్, మాజీ సర్పంచ్‌లు సురేందర్ గౌడ్, చిట్ల సత్యనారాయణ, కొరివి ఆంజనే యులు, చెట్టి శివరాజ్, ఎం. రవీందర్, జనార్దన్, మాజీ ఎంపీటీసీ ఆకుల భార్గవ్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సార నరేందర్ తదితరులుపాల్గొన్నారు.