24-07-2025 11:50:07 PM
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
మల్కాజిగిరి (విజయక్రాంతి): మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) గురువారం వెస్ట్ మారేడుపల్లి జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జలమండలి జీఎం వినోద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి, గౌతమ్‌నగర్ డివిజన్‌లోని ఐ.ఎన్. నగర్ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన జీఎం వినోద్ కుమార్ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మేకల రాము యాదవ్, జేఏసీ వెంకన్న, హేమంత్ పటేల్, సర్వే నరేష్, గద్వాల వంశీ ముదిరాజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.