calender_icon.png 4 August, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2025 04:56:59 PM

మునగాల (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు(BRS Working President Kalvakuntla Taraka Rama Rao) 49వ జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు తోగరు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఏ బాధ్యతలు అప్పగించిన విజయవంతంగా పూర్తిచేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు.