calender_icon.png 4 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ వి. శంకర్ కు మహాకవి సినారె సాహితీ పురస్కారం

24-07-2025 05:06:38 PM

ఈనెల 27న పురస్కారం అందజేత..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డికి చెందిన ప్రముఖ కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. శంకర్ కు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య సంస్థల సమాఖ్య మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారం ప్రకటించింది. సినారె 94వ జయంతి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి డా.వి. శంకర్ ను ఎంపిక చేశారు. కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, అధ్యాపకునిగా చేస్తున్న బహుముఖ సేవలకు గానూ ఈ అవార్డు ప్రకటించారు. డాక్టర్ వి. శంకర్ ఇప్పటివరకు సొంతంగా 8 పుస్తకాలు వెలువరించారు. మరో 11 పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. డిగ్రీ పాఠ్య పుస్తక రచయితగానూ సేవలందించారు.

తెలంగాణ ఉద్యమంపై డాక్యుమెంటరీ రూపొందించి, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 27న యాదాద్రి భువనగిరిలో జరిగే సభలో అందజేస్తారు. ఈ కార్యక్రమానికిహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అవార్డు అందచేస్తారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. పద్మశ్రీ కూరెళ్ళ విఠలాచార్య, సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జె. చెన్నయ్య గౌరవ అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా కామారెడ్డి సాహితీ మిత్రులు, అధ్యాపకులు డాక్టర్ వి శంకర్ ను అభినందించారు.