calender_icon.png 4 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహణ..

24-07-2025 04:53:47 PM

విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద సైకిళ్లు, కుర్చీలు పంపిణీ..

సనత్‌నగర్ (విజయక్రాంతి): మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల సెయింట్ పిలోమిన స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా మొక్కను నాటి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఆధ్వర్యంలో గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం క్రింద విద్యార్థులకు సైకిళ్ళు, ఛైర్స్ ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కేటీఆర్ డైనమిక్ లీడర్ అన్నారు. మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరం, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రోడ్ల కనెక్టివిటీ, ఫుట్ పాత్ ల అభివృద్ధి, పార్క్ లు, వైకుంఠ దామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టి హైదరాబాద్  నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేషన్ రాజు, ఫాదర్ లు ఉదయ భాస్కర్ రెడ్డి, క్రాంతి కుమార్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.