11-10-2025 03:29:32 PM
బిజెపి నాయకులు సంజీవరావు డిమాండ్
మందమర్రి,(విజయక్రాంతి): అధికార పార్టీ నాయకుల వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడిన వేమనపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు యేట మధుకర్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బిజెపి జిల్లా సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధుకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధుకర్ మృతికి వేమనపల్లి మండల
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సై లు కారణం అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డప్పటికి ఇంతవరకు బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం ఉందని గర్వంతో కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇష్టారీతిన వేధించడం వల్ల, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించడంతో పాటు ఎస్ఐ పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తా మని ఆయన హెచ్చరించారు.