18-11-2025 12:00:00 AM
మల్కంబ్, లంగిడి పోటీల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు
అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 17 : పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో ఉన్న వ్యాస్ మోడల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మల్కంబ్, లంగిడి పోటీల్లో ప్రతిభచాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మల్కంబ్ జాతీయస్థాయి పోటీలకు వేముల యశశ్విని, లంగిడి జాతీయస్థాయి పోటీలో వేముల యజ్ఞ, జాను ఎంపికయ్యారు. వీరు గుజరాత్ రాష్ట్రంలోని వడదొరాలో ఈ నెల 21 నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని వ్యాస్ స్కూల్ పీఈటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ 24న జరగనున్న మల్కాoబ్ పోటీల్లో యశశ్విని పాల్గొంటుంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ముగ్గురు విద్యార్థుల్లో యశశ్విని, యజ్ఞ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. జాతీ య స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు వ్యాస్ మోడల్ స్కూల్ చైర్మన్ సర్వేశ్వర్ రెడ్డి, కోచ్ నీలేశ్ అభినందనలు తెలిపారు.