18-11-2025 12:00:00 AM
కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక
యాదాద్రి భువనగిరి , నవంబర్ 17 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరిపడ లారీలు పంపించాలని లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఈరోజు ఎన్ని ధాన్యం కుప్పలు కొనుగోలు చేశారు.
ఇంకా తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఎంత లేట్ అయినా ఉండి లైట్ ఏర్పాటు చేసుకొని తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి రోజు 4 లారీలు కేంద్రానికి వచ్చేలా చూడాలని సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశించారు. సరిపడ లారీలు పంపించకపోతే లేకపోతే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు పెట్టీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లు ధాన్యం వచ్చిన వెంటనే హమాలీల ద్వారా లారీల నుండి అన్లోడ్ చేయాలన్నారు.