calender_icon.png 24 October, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సుప్రమాదం.. 19 మృతదేహాలు వెలికితీసిన ఫోరెన్సిక్ బృందం

24-10-2025 10:52:19 AM

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో(Kurnool Bus Accident) 19 మంది సజీవదహనం అయినట్లు అధికారులు ప్రకటించారు. బస్సులో నుంచి 19 మృతదేహాలను ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకున్నాయి.

మంటల్లో చిక్కుకుని 19 మంది మృతి చెందగా, 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 41 మంది ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు, 10 మంది మహిళలున్నారు. ఈ అగ్నిప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సును బైకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైకును బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు వ్యాపించాయి. ఎమర్జన్సీ డోర్ పగలగొట్టి పలువురు ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు వెనుక అద్దం పగలగొట్టి పలువురిని ఇతర  ప్రయాణికులు కాపాడారు. స్వల్పగాయాలతో బయటపడిన 21 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.