03-01-2026 12:00:00 AM
నిజామాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో సాయి అశ్విని హాస్పిటల్ లో ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ (27) అనే యువకుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషి యన్ మృతుడు పని చేస్తున్నట్టు తెలుస్తోం ది. ఓంకార్ స్వస్థలం ధర్మాబాద్ గా పోలీసులు గుర్తించారు.
రోజువారి లాగే విధులకు వచ్చిన ఓంకార్ ఇవాళ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచార మిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఓంకార్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రి బాత్రూంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఓంకార్ బలవన్మరణానికి పాల్పడడం ఖలీల్ వాడి ఆసుపత్రి గాలలో వర్గాలలో కలకలం రేపింది.