calender_icon.png 3 January, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల ఇండ్ల కూల్చివేతపై రాష్ట్ర ఎస్టీ కమిషషన్‌ను ఆశ్రయించిన బాధితులు

03-01-2026 12:00:00 AM

మొయినాబాద్ జనవరి 2 (విజయ క్రాంతి): గిరిజన కుటుంబాల ఇండ్ల కూల్చివేతల వివాదం జాతీయ ఎస్టీ కమిషన్కు చేరింది.గిరిజనుల ఇండ్ల కూల్చివేతల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇండ్లు కూల్చివేయించిన చేయించిన వ్యక్తులకు, ఇండ్లను కూల్చిన మున్సిపల్ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకోనుంది. ఇండ్లను కూల్చివేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు ఉషనానాయక్కు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో కూల్చివేతలో ఇండ్లు కోల్పోయిన గిరిజన బాధితులు ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలోని 210,211,212 నంబర్లలో 16 ఎకరాల్లో రాఘ వేంద్ర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చేసిన వెంచర్లో పాత మహబూబ్నగర్కు చెందిన 50 గిరిజన కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం.ఇండ్లు కట్టుకోవడానికి ఆర్ధిక స్థోమత లేని వారు గుడిసెలు వేసుకుని పిల్లాపాపలతో నివాసం ఉంటూ కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.

మీరు ఇండ్లు కట్టుకున్న ఇంటి స్థలాలు మాకు సంబంధించినవని ఇండ్లు కాలి చేసి వెళ్లి పోవాలని గత ఏడాది నుంచి శ్రీనివాస్జు, డి సురేష్ రెడ్డి, శ్రీనివాస్డ్లు అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా వేదిస్తూ వచ్చారు. ఎప్పటికైనా తమ ఇండ్లు కూల్చివేస్తామని భయబ్రాంతులకు గురి చేయడంతో కొంత మంది గిరిజనులు హైకోర్టును ఆశ్రయించి స్టే కూడ తెచ్చుకున్నామని చెప్పారు. కాని సదరు వ్యక్తులు మంగళవారం తెల్లవారు జామున పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటు 100 బౌన్సర్లతో మున్సిపల్,టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి నిద్రపోతున్న మమ్మలను పిల్లలను బలవంతంగా ఇంట్లో నుంచి పోలీసులతో గెంటి వేయించారు.

సామాగ్రిని కూడ తీసుకోనివ్వకుండ జేసీబీలతో ఇండ్లను పది నిమిషాల్లో నేల మట్టం చేసి మమ్మలను రోడ్డు పాలు చేశారని ఎస్టీ కమిషన్ సభ్యుడికి తమ ఆవేదన చెప్పుకున్నారు.కులం పేరుతో దూషించి ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఇండ్లు కూల్చివేయడానికి వచ్చిన వెంటనే పోలీసులు తమ వద్ద నుంచి సెల్ఫోన్లు బలవంతంగా గుంజుకున్నారని, బైక్ తాళం చెవిలు తీసుకున్నారని ఎవరిని ఎటు వెళ్లనివ్వకుండ మా చుట్టుముట్టు పోలీసులు, బౌన్సర్లు ఉన్నారని చెప్పారు. ఇండ్లు కూల్చే ముందు విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని తెలిపారు.

అందరం ప్రాణ భయంతో తల్లడిల్లిపోయామని ఎవరికి చెప్పాలో అర్ధం కాని పరిస్థితి అని చెప్పా రు. శ్రీనివాస్ రాజు, సురేష్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు ఓ పోలీసు ఉన్నతాధికారి అండదండులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.  ఇండ్ల కూల్చివేతల్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం చేశారని మున్సిపల్ కమిషనర్ మీద కూడ ఫిర్యాదు చేశారు.

ఆయన తమరికి న్యాయం చేస్తానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్లాట్లు తమకు ఉంటాయని మనోధైర్యం ఇచ్చారు. వెంటనే జాతీయ ఎస్టీ కమిషన్కు కూడ ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయనను కలిసిన వారిలో నాయకులు ఎం శ్రీకాంత్, సుదీంద్రశర్మ, కృష్ణయాదవ్, గిరిజన బాధితులు ఉన్నారు.