calender_icon.png 25 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్

25-09-2025 12:27:40 AM

రెండో బ్రాంచీ ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచీని వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బీ నరసింహరెడ్డి, బీ ఆషుతోష్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచీతో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్.. ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచీని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

దసరా సందర్భం గా ప్రత్యేక ఆఫర్‌గా అక్టోబర్ 2 వరకు రూ.5 వేల కుపైగా షాపింగ్ చేసిన వారికి 30శాతం వరకు ఫ్రీ షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం అన్ని రకాల ప్రత్యేకమైన చీరలను తక్కువ ధరకు అందజేస్తున్నామని, ప్రజలు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని షాపింగ్‌మాల్ కు మరింత ప్రోత్సాహం అందించాలని వారు కోరారు.