15-11-2025 12:00:00 AM
టోక్యో, నవంబర్ 14 : భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ జపాన్ మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ కియోన్ యోకు షాకిచ్చాడు. టైటిల్ దిశగా అడుగులు వేస్తున్న ఈ భారత షట్లర్ 21 21 స్కోర్‌తో కియోన్‌పై విజయం సాధించాడు.
లక్ష్యసేన్ ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ కేవలం 39 నిమిషాల్లోనే విజయాన్ని అందుకున్నాడు. ఓపెనింగ్ గేమ్‌లో రెండుసార్లు స్కోర్ సమమైనా లక్ష్య అద్భుతంగా పుంజుకుని పై చేయి సాధించాడు. సెప్టెంబర్‌లో హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన లక్ష్యసేన్ సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన ఆరో సీడ్, వరల్డ్ నెం.13 ప్లేయర్ కెంటా నిషిమోటోతో తలపడనున్నాడు.