calender_icon.png 15 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత భకత్, ధీరజ్‌లకు స్వర్ణాలు

15-11-2025 12:00:00 AM

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్

ఢాకా, నవంబర్ 14 : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో అంకిత భకత్ సంచలనం సృష్టించింది. ఫైనల్స్‌లో సౌత్‌కొరియాకు చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడిలిస్ట్ నమ్ సుయోన్‌కు షాకిచ్చింది. స్వర్ణపతక పోరులో 7 పాయింట్ల తేడాతో అంకిత విజయం సాధించింది.

తద్వారా ఆసియా చాంపియన్‌షిప్ మెడల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. సెమీఫైనల్స్‌లో ఆమె భారత అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపికాకుమారిపై గెలిచింది. అలాగే పురుషుల విభాగంలో ధీరజ్ బొమ్మదేవర కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్స్‌లో ధీరజ్ 6 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన రాహుల్‌పై విజయం సాధించాడు.

దీంతో ఆసియా చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే మహిళల రికర్వ్ ఈవెంట్‌లో భారత్ కాంస్యం గెలిచింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 10 పతకాలు గెలుచుకుంది.