calender_icon.png 15 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీ శాంతి ర్యాలీతో జనసందోహం

15-09-2025 01:09:11 AM

- ఎస్టీ నుండి లంబాడీలను తొలిగించడం ఎవడి తరం కాదు 

- లంబాడీల ఆత్మగౌరవం దెబ్బ తీస్తే సహించేదిలేదు..

- తెల్లం,సోయంకి వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరో లంబాడీ సమాజానికి తెలుసు వారినీ ప్రజా క్షేత్రంలో ఎండగడుతాం 

- అన్నదమ్ముల ఉండి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం రండని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీ జేఏసి పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ శాంతి తో జన సంద్రోహ మైంది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది లంబాడీలు తరలివచ్చి శాంతి ర్యాలీ ని విజయవంతం గా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూ క్యా రమేష్,లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించినలంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీలో భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీ జేఏసి నా యకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,గుగులోత్ రాజేష్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు.

లంబాడీల పై జరుగుతున్న అసత్వ ప్రచారాన్ని తిప్పికొడుతూ నిర్వహించిన నినాదాలతో హోరెత్తితింది.ఎస్టీ నుండి లంబాడీలను తొలిగించడం ఎవడి త రం కాదని, లంబాడీల ఆత్మగౌరవం దెబ్బ తీ యాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లంబాడీలు బ్రిటీష్, నిజాం కాలం నుండే ఎస్టీలుగా గుర్తించబడ్డారని, కొత్తగా లంబాడీలు ఎస్టీ కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.భారత రాజ్యాంగం అమలులో వచ్చిన రోజునే ఆర్టికల్ 342 ప్ర కారం ఆంధ్ర, రాయలసీమ ప్రాంత సుగాలి లు ఎస్టీలు గా ఉన్నారని, శ్రీమతి ఇందిర గాంధీ మాజీ ప్రధాని మంత్రి హయాంలో సుగాలి,లంబాడీ,బంజారాలు ఒక్కటేనని గు ర్తించి 1976 ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా లంబాడీలను ఎస్టీలుగా గుర్తిం చి ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు ఇచ్చారని గుర్తు చేశారు.తెలంగాణ ప్రాంతం నిజాం పాలన లో ఉన్న కారణంగా 1950 నుండి 1976 వ రకు సుమారు 26 సంవత్సరాలు తెలంగాణ లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందలేక పోయామని వాపోయారు.

సోకాల్ నా యకులు తెల్లం. తన ఓటమి తేటతెల్లం అ య్యిందని తెలిసి అన్నదమ్ముల కలిసి మెలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలను కోవడం సరికాదని హెచ్చరించారు.స్వలాభం కోసమే తెల్లం, సోయం గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలుసుకొని, ఇద్దరిని ఆదివాసీ సమాజం నమ్మడం లేదని,వీళ్ళ వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరో, లంబాడీ సమాజానికి తెలుసని వారిని వెం టాడి మరీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. అన్నదమ్ముల ఉండి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం రండని భద్రా ద్రి కొత్తగూడెం లంబాడీ జేఏసి పిలుపు ఇ చ్చారు.

ఈ ర్యాలీ లో ప్రేంచంద్ నాయక్,స్వ రాజ్ నాయక్,హుస్సేన్ నాయక్,సంజీవ్ నా యక్, డాక్టర్ రాజ్ కుమార్,వీరు నాయక్, డాక్టర్ వెంకన్న, లాల్సింగ్ నాయక్,కిషన్ నా యక్, కాన్షీరాం,రాములు,హతీరామ్,రవి రా థోడ్, లాలు నాయక్,హుస్సేన్ నాయక్,కిషో ర్ సింగ్, లాలూ నాయక్, బాలు, రాంజీ, శోభన్, జంకిలాల్, రవి, శంకర్ నాయక్, చం దర్,బిచ్చ నాయక్,ఈర్య, పూల్సింగ్,వీరన్న, నాగరాజు, కిషన్ నాయక్,గణేష్ రాంచందర్ నాయక్ జనార్దన్ నాయక్, మంగిలాల్, కేశవ, గడ్డం శ్రీను, శ్రీను, రాంబాబు నాయక్ దేవీలాల్, ఉపేందర్, బాలకృష్ణ, బాబూలాల్,యమున,మోతీలాల్, లక్ష్మి బాయి, రుక్మిణి బాయి తదితరులుపాల్గొన్నారు.