calender_icon.png 10 September, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడాలు అసలు ఎస్టీలే కాదు

09-09-2025 12:20:52 AM

జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి

వాజేడు, సెప్టెం బర్ 8 (విజయ క్రాంతి): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. వాజేడు మండలంలో సోమ వారం ఆయన ఆదివాసీ గ్రామా లను పర్యటిస్తూ. పెనుగోలు గ్రామం ఆదివాసీ ప్రజలతో సమావేశమై ఆయన మాట్లాడారు. లంబాడా లు అసలు ఎస్టీలే కాదనీ, నిజమైన ఎస్టీ లు ఆదివాసీలనీ అన్నారు.

లంబా డాలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి, ఎస్టీలుగా చలామణి అవుతూ, ఆదివాసీలు పొందాల్సిన రిజర్వేషన్ ఫలాలు అక్రమ మార్గంలో వారు అనుభవిస్తున్నారన్నారు. లంబా డాలు గిరిజనులుగా చెలామని కావ డంతో ఆదివాసీల ప్రయోజనాలు అన్ని తన్నుకపోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ పై సవతి తల్లి ప్రేమ చూయిస్తు న్నాయని ఆరోపించారు. రాజ్యాం గం ప్రకారం ఒక కులాన్ని తెగగా గుర్తించాలంటే కొన్ని నియమ నిబం ధనలు ఉంటాయని తెలిపారు.

ముందుగా ప్రభుత్వం కమిషన్ నియమించాలి, గవర్నర్ నిర్ధారణ అనంతరం జాతీయ షెడ్యూల్ తెగలు, కులాల కమిషన్, ఆంత్రో పాలజీ డిపార్ట్ మెంట్ చేత  గుర్తింపు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఆర్టికల్ 342 సవరణ తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఎస్టీలుగా గుర్తించబడతారు అని తెలియజేశారు. 

ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్న లంబా డాలను  ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చబడిన లంబాడాలను తొలగిం చాలని డిమాండ్ చేశారు. త్వరలో అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వ ర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఆదివాసీ అడ్వెకెట్ పర్శిక సోమరాజు, ఆదివాసులు పాల్గొన్నారు.