09-09-2025 12:21:19 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 8,( విజయ క్రాంతి):స్థానిక మండల పరిషత్‌కార్యాలయంలో సోమవారం వివిధ రాజకీయ పా ర్టీల నాయకులతో ఎంపీడీవో డి. రామారా వు సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో పది ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీ టీసీ స్థానానికి నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ ముసాయిదా లిస్టు ను, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన రాజకీయ పార్టీల నాయకులకు వివరించా రు.
మండలంలో మొత్తం ఓటర్లు 28,380 మంది ఉన్నారని, ఇందులో పురుషులు 13,887, మహిళలు14,493 మంది ఓటర్లుగా ఉన్నారని ఆయన తెలిపారు. మం డలంలో మొత్తం 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ స మావేశంలో మండలంలోని వివిధ రాజకీ య పార్టీలకు చెందిన పాల్గొన్నారు.