calender_icon.png 1 July, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులో వచ్చిన భూభారతి అర్జీలను త్వరగా పరిష్కరించాలి..

01-07-2025 06:56:22 PM

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..

నాగారం: నాగారం భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. నాగారం మండలం లక్ష్మాపురంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిశీలన ప్రక్రియను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆర్జీల పరిశీలన ప్రక్రియను, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రైతులు పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులకు తమ పూర్తి సహకారం అందించాలని సమస్యకు సంబంధించిన ఆధారాలు దస్తావేజులు తప్పక అధికారులకు చూపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ రావు, తాసిల్దార్ హరి కిషోర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ షఫీ మహమ్మద్, సర్వేయర్ సాయి, రాజు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.