calender_icon.png 1 July, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉంటుంది

01-07-2025 06:53:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సమాజంలో నూతన మార్పులు తెచ్చే గొప్ప శక్తి మీడియాకు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్(District Congress Committee President Vishwaprasad) అన్నారు. నూతనంగా ఎంపికైన ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస్, ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు సాయి కుమార్, సదాశివులను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ తో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మీడియా అనేది ఎంతో గొప్ప ఆయుధమన్నారు. దానిని ఉపయోగించి సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి పనులకు నూతన కమిటీ కలిసి రావాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలేష్ గౌడ్, మల్లేష్, చరణ్, శ్యామ్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.