calender_icon.png 5 August, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ్దురాలి భూమి కబ్జా.. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

05-08-2025 12:00:00 AM

విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ

కాగజ్‌నగర్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): ఓ వృద్ధురాలు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు సృష్టించి తనపై ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటనతో బాదిత వృద్ధురాలు సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది.

చింతల మానపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృత్తురాలు బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఇతరుల  పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధిత వృద్ధురాలు తన బిడ్డలతో కలిసి ఆందోళనకు దిగడంతో సిపిఎం నాయకులు ఆనంద్ కుమార్ మద్దతు పలికారు.కార్యాలయం ఎదుట నన్ను చేస్తున్న విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల వృద్ధురాలు వద్దకు వచ్చే పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది.