calender_icon.png 5 August, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయండి

04-08-2025 11:31:18 PM

వసతి గృహలపై ప్రత్యేక నిఘా ఉంచండి 

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి..

ముసాపేట: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన వాటిని గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) సూచించారు. సోమవారం మూసాపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఎస్.సి ప్రభుత్వ బాలుర వసతి గృహం, తహశీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని మూసాపేట గ్రామంలో 94 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 36 గ్రౌండింగ్ చేసినట్లు, వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ లబ్దిదారుడు శ్రీనివాస్ తో మాట్లాడుతూ.. ఎన్ని చదరపు అడుగులలో నిర్మించారు? "554 చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్దిదారుడు తెలిపారు. 

ఇల్లు కట్టడానికి దశలవారీగా డబ్బులు వచ్చాయా ఇప్పటివరకు 3 దశలలో వచ్చాయి అని తెలిపారు". ఇల్లు మొత్తం పూర్తి కావడానికి  ఎంత ఖర్చు అవుతుంది?"10 లక్షలు అవుతుందని తెలిపారు".ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్దిదారులు  త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఇంటి నిర్మాణం దశల ఆధారంగా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది అని తెలిపారు.కుటుంబ సభ్యుల వివరాలు, ఇల్లు  నిర్మాణం మేస్త్రీ ఎవరి చేస్తున్నారు?  "నేనే కట్టుకుంటున్నా మేడం అందుకే ఇంత తక్కువ ఖర్చు అవుతుంది" ఇప్పటివరకు ఎన్ని ట్రాక్టర్లు ఇసుక వినియోగించారు? " ఇప్పటివరకు 8 ట్రాక్టర్ల ఇసుక వినియోగం అయినట్లు, ఇంకా ఇసుక అవసరం ఉంది. వర్షం వలన వాగు నిండింది. ఇసుక తీయడానికి వీలు లేదు .ఇంటి నిర్మాణంలో ఆలస్యం అవుతుంది" అని తెలిపారు ఇందిరమ్మ కమిటీ  సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. 

క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని,ఇందిరమ్మ కమిటీలు మేస్త్రీలతో మాట్లాడి తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసుకునేలా చూడాలని కోరారు. గ్రామంలో ఎస్. సి. బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు  వసతి గృహం లో పరిశుభ్రత లేకపోవడం,మెనూ ప్రకారం ఆహార అందించకపోవడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం   విద్యార్థుల కు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని  జిల్లా కలెక్టర్  హెచ్చరించారు. వసతి గృహం  డ్రైనేజీ, చుట్టుపక్కల పరిసరాలు, గదులు,   పరిశుభ్రంగా లేక పోవడం, వార్డెన్ లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతూ. అక్కడి వసతులు, సౌకర్యాలు,భోజనం విద్యార్థుల సంఖ్య గురించి అడిగారు 14 గదులు ఉన్నాయి 60 మంది విద్యార్థులు ఉన్నారు .మొత్తం విద్యార్థులను లెక్కించగా 49 మంది ఉన్నారు.మిగతా వారు  ఎందుకు రాలేదు ఆరా తీశారు.10 వ తరగతి విద్యార్థులు ఎంత మంది ఉన్నారు? భవిష్యత్ లక్ష్యం ఏమిటి? మెడికల్ క్యాంపు నిర్వహించారా?ఎప్పుడు జరిగింది? "శనివారం జరిగింది మేడం" అని విద్యార్థులు తెలిపారు  వసతి గృహం గదులు , పరిసరాలు  పరిశుభ్రంగా ఉంచాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. విద్యార్థులతో  మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం నాణ్యత తో అందించాలని ఆదేశించారు.

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్​

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల  దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి  తహశీల్దార్ ను ఆదేశించారు. మూసాపేట్  తహశీల్దార్ కార్యాలయంను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగటం లేదని, భూభారతి దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత నిచ్చి    వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజు,మండల అధికారులు ఉన్నారు.