calender_icon.png 3 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం

19-04-2025 11:27:44 PM

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

గండీడ్: భూభారతితో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో, గండేడ్ మండలంలోని  వెన్నచెడు  గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు పెరిగే ఎమ్మెల్యే రహమాన్ రెడ్డి మాట్లాడారు. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధమే భూమికి రైతుకు ఉన్న అనుబంధమని తెలిపారు. ధరణి తీసుకుపోయి పాతల గంగలో వేస్తామని చెప్పిన నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట మీద నిలబడి భూభారతి ని తీసుకురావడం జరిగిందన్నారు.

హోటల్లో భూ సమస్యల త్వరగా పరిష్కారం కావని భూభారత్తో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అందరికీ సముచిత న్యాయం కల్పించాలని సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మంచి పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గండీడ్, అహమ్మదాబాద్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, కేయం నారాయణ, Pacs  చైర్మన్ గిరిమోని లక్ష్మీనారాయణ, పులిందర్ రెడ్డి, అనంత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమతం విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శాంతి రంగ్య, రాధారెడ్డి, రాములు, గండీడ్ మండల ఎంపీడీవో దేవన్న, తాసిల్దార్ నాగలక్ష్మి. డిటి మాధవి, మహమ్మదాబాద్ మండల తాసిల్దార్ తిరుపతయ్య, సిబ్బంది తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు.