calender_icon.png 18 May, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం

23-04-2025 01:40:31 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) ః భూభారతి చట్టంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు పరిష్కారం లభించనున్నదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని భూభారతి సదస్సులో మాట్లాడుతూ... ఇకపై భూ సమస్యలు ఉండవని అందుకు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం భూభారతి ప్రవేశపెట్టి ఆరో ఓ ఆర్ చట్టం తో సమస్యలకు చెక్ పెట్టనున్నది అన్నారు.

ధరణిలో పరిష్కారం కానీ సమస్యలన్నీ భూభారతిలో అప్పిలు వ్యవస్థ ఉన్నందున పరిష్కారం అవుతాయన్నారు. భూ రక్షణ కొరకు ఇకపై సర్వే నెంబర్ తో పాటుగా హద్దులతో మ్యాప్ ను రూపొందించి పాస్ బుక్ లో ఉంచుతామన్నారు.కబ్జాలు, ఆక్రమణలు జరగవని, భూమికి మరింత భద్రత లభించనున్నదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి తో సమస్యలు పరిష్కారం

రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం - 2025 అమలుతో అధికారుల మధ్య వికేంద్రికరణ జరుగుతుందని, ఇందులో ఉన్న ఐచ్ఛికాలతో సులభంగా రైతులు వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం  పట్టణం సుమంగళి పంక్షన్ హాల్, పెన్ పహాడ్ పంక్షన్ హాల్ లో  భూ భారతి చట్టం- 2025  పై  అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి రాంబాబు, రాష్ర్ట వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ధరణి వైఫల్యాలు సరిదిద్ది పారదర్శకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూ భారతి చట్టం ఈ నెల 14 న ప్రారంభించారని గుర్తు చేశారు. ,సాధాబైనామా ధరఖాస్తులు ధరణిలో పరిస్కారం కాలేదని భూ భారతిలో సాధాబైనామ ధరఖాస్తులు పరిశీలించి క్రమబద్దికరించడం జరిగిందన్నారు.