23-04-2025 01:40:03 AM
*ఐదు ఎకరాలలో మినీ స్టేడియం
*ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 22 :పటాన్ చెరు నియోజకవర్గంలోని పేద మద్యతరగతి విద్యార్థుల కోసం అత్యాధునిక వస తులతో కార్పొరేట్ విద్యను అందించేందుకు అమీన్ పూర్లో నవోదయ విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు.
వీటికి సంబందించిన ప్రతిపాధనలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు. మంగళవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గోశాల సమీపంలో విద్యా సంస్థల ఏర్పాటుకు సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలాన్ని స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే నవోదయ విద్యాలయాన్ని అమీన్ పూర్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వ స్థలాల వివరాలను పంపించాలని సంబందిత అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కూడా స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. నవోదయ విద్యాల యం కోసం 20 ఎకరాలు, మినీ స్టేడియం కోసం 5 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు ఏర్పాటు అయితే నియోజ కవర్గంలోని పేద మద్యతరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
మినీ స్టేడియం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, ఆర్‌ఐ రఘునాథ్ రెడ్డి, గోపాల్, ఉపేందర్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.