calender_icon.png 30 July, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలి

29-07-2025 11:02:10 PM

జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి..

నర్సంపేట (విజయక్రాంతి): దుగ్గొండి మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం భూభారతి దరఖాస్తుల పురోగతిపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి(Additional Collector Sandhyarani) సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. భూ భారతి, రెవిన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. భూభారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను సత్వరమే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు 10 నాటికి అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని తాహసిల్దార్ రాజేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రాజేశ్వరరావు, డిటి ఉమారాణి, ఆర్ ఐ రాంబాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.