విరిగిపడిన కొండచరియలు

26-04-2024 12:05:00 AM

అరుణాచల్‌లో కొట్టుకుపోయిన హైవే

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డా యి. ధిబాంగ్ జిల్లాలో చైనా, భూ టాన్ సరిహద్దు కలిపే హున్లీ అనిని జాతీయ రహదారి గురువారం కొట్టుకుపోయింది. విపత్తుపై అక్కడి సీఎం ప్రేమఖాండు ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ధిబాంగ్‌ను లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపే ఏకైక హైవే కొట్టుకుపో యిందన వార్త తనను కలవర పరి చిందని, వర్షాలు తగ్గగానే హైవేకు మరమ్మతులు చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికార వర్గాలు తెలి పాయి. నిర్వాసితులకు ఆహారం, నిత్యావసరాల కొర త లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నాయి. ధిబాంగ్ లోయ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.