11-10-2025 12:00:00 AM
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్‌సేన్, హాస్యచిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కేవీ అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తు న్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
అనుదీప్ దర్శకత్వంలో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా ఎంతో హాస్యభరితంగా ఉన్న ఈ టీజర్ సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిని పెంచేలా ఉంది. అనుదీప్ ఈసారి ‘జాతిరత్నాలు’ కన్నా రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇందులో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్ తన అందంతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం; కూర్పు: నవీన్ నూలి; నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య; రచన, దర్శకత్వం: అనుదీప్.