11-10-2025 03:35:01 PM
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చుతే పదేళ్లలో తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి అప్పుల పాలు చేసింది చాలక ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డులు పంచుతారా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకిచ్చిన ఏఏ హామీలు నెరవేర్చలేదో అవన్నీ కార్డులో పొందు పరిచారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ఇంకొక వైపు పొందు పరచి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు తెలంగాణ ప్రజలను డోఖా చేసినందుకు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని డోఖా చేసింది చాలక అనేక సంక్షేమ పథకాలతో ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు.ప్రజలు బీఆర్ఎస్ నాయకుల నాటకాలను గమనిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల నాయకుల వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తరిమికొడతారని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని అన్ని డివిజన్లలో కార్డులు పంపిణీ చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.