calender_icon.png 11 October, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

11-10-2025 04:44:47 PM

చేగుంట: మెదక్ జిల్లాలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీని తనిఖీ చేయడంతో పాటు అక్కడ రోగులకు, అందుతున్న వైద్యసేవలపై, దవాఖానలో ఓపి రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజు ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా, అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గత నెలలో ఈ పల్లె దవాఖాన పరిధిలో ఎన్ని డెలివరీలు అయ్యాయి, అవి ఏ ఆసుపత్రులలో అయ్యాయో అని ఆరా తీశారు. పల్లె దవాఖానలో పరిశుభ్రంగా ఉంచుకోవడం, వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.