11-10-2025 02:42:30 PM
కొత్తపల్లి, (విజయక్రాంతి): గత పది సంవత్సరాల నుండి సాంఘిక గురుకుల కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ విద్యార్థినులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ సబ్జెక్టు పరంగా విద్యార్థినులను స్టేట్ ర్యాంకులకు కృషి చేసినటువంటి లెక్చరర్ దొగ్గలి స్వరూప ప్రతిభను గుర్తించి మన ఫౌండేషన్ ద్వారా ఆమెకు 2025 బెస్ట్ లెక్చరర్ అవార్డు ప్రకటించి దానిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆమెకు శాలువా కప్పి మెమొంటోను మరియు సర్టిఫికెట్ ఇచ్చి అభినందనలు తెలిపారు.