11-10-2025 03:51:08 PM
హైదరాబాద్: నవంబర్ నెల చివరి వరకు వి హబ్ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీసీసీ లో ఏఐ హబ్,టీ స్క్వేర్ పైన ముఖ్యమంత్రి శనివారం సమీక్షించారు. టీ స్క్వేర్ నిర్మాణ తెలంగాణ ఐకానిక్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీ స్క్వేర్ లో ఆపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్ లెట్లు ఉండాలని, ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో భవనాలను పరిశీలించాలన్నారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి. వి హబ్ 24 గంటల పాటు పని చేయాలని అధికారలకు ఆయన సూచించారు. ఏ ఐ హబ్ కోసం కార్పస్ ఫండ్, అందులో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.