11-10-2025 04:24:38 PM
చిల్పూర్/జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం వార కళ్యాణము వేదమంత్రోచరణలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గణగోని రమేష్, వేముల వెంకటేశ్వర్లు, తాళ్ల పెళ్లి బిక్షపతి, ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, సూపరిండెంట్ వెంకటయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్, అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ వాస్తవ్యులు నాగేశ్వర్ రావు - విజయలక్ష్మి దంపతులు అన్నదానం కోసం రూ. 25 వేలు విరాళంగా అందించారు. బోల్గాం శివశంకరయ్యా-నాగేంద్రమ్మ, సిహెచ్ నాగేశ్వర్-ఉమారాణి, వలబోజు వెంకటేశ్వర్లు-పద్మావతి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగింది.