calender_icon.png 4 December, 2024 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం

30-10-2024 01:18:54 AM

ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి 

నల్లగొండ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని,  ప్రభుత్వం రాజధానిలో నిషేదాజ్ఞలు విధించడమే అందుకు నిదర్శనమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ సీనియర్ నేత మంకెన కోటిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

జన్వాడ ఫాంహౌస్‌లో జరిగింది రేవ్ పార్టీ కాదని, ఫ్యామిలీ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాలన పడేకేసిందని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను పడగొట్టి పెద్దోళ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నదని ధ్వజమెత్తారు.

విద్యుత్ సంస్థలతో బీఆర్ ఎస్ నాయకులు జరిపిన చర్చల కారణంగా నే ప్రభుత్వం ఛార్జీల పెంపుపై వెనక్కు తగ్గిందని, ఇది గులాబీ పార్టీ నైతిక విజయమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచన చేయలేదని గుర్తుచేశారు.