calender_icon.png 9 July, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెకు ఇల్లందు న్యాయవాదుల సంఘీభావం

09-07-2025 07:17:31 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు కోర్టు ఆవరణంలో బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర వైఖరిని ఖండిస్తూ ఇల్లందు బార్ అసోసియేషన్(Bar Association) న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేసి సంఘీభావం తెలిపారు. కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను విభజన చేసి కార్మికుల హక్కులను హరించడమేనని కోడులుగా విభజించిన కార్మిక చట్టాలను వెంటనే రద్దుచేసి యధాస్థితికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ముందు చూపులేని చర్యలు చేపట్టినట్టయితే  రైతు, కార్మిక సంఘాలన్నీ కలుపుకుపోయి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతంగానికి, కార్మిక సంఘాలకు ఎల్లప్పుడూ మా బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అధ్యక్షులు కే. ఉమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్ న్యాయవాదులు ఎన్. మల్లికార్జునరావు, పీ. కరుణాకర్ పి. గోపీనాథ్, దంతాల ఆనంద్, కొండ నారాయణ, మామిడి సత్య ప్రకాష్, బి. రవికుమార్ నాయక్, టీ. మహేశ్వరరావు, పి. అనిల్ కుమార్, ఎస్. బన్సిలాల్ తదితరులు పాల్గొన్నారు.