calender_icon.png 10 July, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేయర్ తేజశ్వర్ కుటుంబ సభ్యులకు పరామర్శ..

09-07-2025 11:11:24 PM

నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి..

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణా రెడ్డి బంగ్లాకు చెందిన సర్వేయర్ తేజశ్వర్ గత కొంతకాలం క్రితం కర్నూలు జిల్లా పాణ్యంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంకు ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) హాజరయ్యారు. అనంతరం మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత, స్థానిక నాయకులతో కలిసి ఆయన మృతుడు సర్వేయర్ తేజశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.