09-07-2025 07:20:05 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధికారులు పరిశీలన కార్యక్రమం చేపట్టారు. స్థానిక 13వ వార్డ్ గాంధీ నగర్ ఏరియాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, డి ఈ సాయి కిరణ్ పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలను పరశీలించిన అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అధికారుల వెంట వార్డు ఆఫీసర్ దుర్గయ్య, హౌసింగ్ ఏఈ సాయి ప్రసన్న ఉన్నారు.