calender_icon.png 10 July, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో చైతన్యానికే పోలీసు భరోసా

09-07-2025 11:08:20 PM

నూతనకల్ (విజయక్రాంతి): ప్రజలను చైతన్యపరచడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సిఐ నరసింహారావు(CI Narasimha Rao) అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెదనెమిల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో ప్రజలు సామాజిక అంశాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు, ప్రజల సహకారం లేకుండా పోలీసు న్యాయవ్యవస్థ పటిష్టంగా పనిచేయడం సాధ్యపడదు అన్నారు. ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ అన్యాయాన్ని సహించకుండా ముందుకు వస్తే పోలీస్ శాఖ మేమున్నామంటూ భరోసా ఇస్తుందన్నారు. సమాజంలో యువత మాదగద్రవ్యాలకు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడకుండా చదువులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.