09-07-2025 07:13:45 PM
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఆంగోత్ నరేష్ కుమార్(Additional SP Angoth Naresh Kumar) కేంద్ర హోం శాఖ అందించే అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. 1991లో పోలీసు శాఖలో ఎస్ఐగా విధుల్లో చేరిన నరేష్ కుమార్ అంచలంచెలుగా ఎదుగుతూ 2006లో సీఐగా, 2017లో డీఎస్పీగా ప్రమోషన్ పొంది, మహబూబాబాద్, మామునూర్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు.
2023లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది ఖమ్మం పోలీసు కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీగా విధులు నిర్వర్తించారు, తాజాగా భూపాలపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అనేక కేసుల్లో సమర్థవంతంగా నేర విచారణ నిర్వహించి నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయడంతో నరేష్ కుమార్ కు ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసింది. ఇంతకు ముందు నరేష్ కుమార్ పోలీసు సేవా పతకం, కఠిన సేవా పతకంతో పాటు, ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ ను అందుకున్నారు. తాజాగా అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన ఏఎస్పీ నరేష్ కుమార్ ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.